Monday, June 8, 2009

అమ్మ ప్రేమ

అమ్మ ప్రేమ" ని మించిన ప్రేమ ఈ ప్రపంచం లో ఉంది అని ఎవరైనా చెపితే అది తప్పకుంఢా ఆబద్దమే...



ప్రియ నేస్తం.... ప్రపంచం అంతా దూరం అయినా... నీకు ‘నేను’ ఉన్నా అని చెప్పేవాడే “స్నేహితుడు”...ఆ స్ధానంలో నాకు “నాకు నువ్వు” “నీకు నేను” ఒకరి కొకరు.. ఈ స్నేహమే మన ప్రపంచం “నువ్వు” అనే ఈ రెండక్షరాలే నా చేయి పట్టి నడిపిస్తుంటే...నువ్వు అనే ఈ రెండక్షరాలే నా జీవితానికో మార్గాన్ని వేస్తుంటే...నువ్వు అనే ఈ రెండక్షరాలే నన్ను ఇంతగా ప్రభావితం చేస్తుంటే.....ఇంతకు ముందెపుడూ, నేనెరుగని మమతాను భంధమేదో... నువ్వు నా చుట్టూ పెనవేస్తుంటే.....నీ స్నేహ మాధుర్యాన్ని నాకు చవిచూపిస్తుంటే ........... నాకు నువ్వు వున్నావనే భావన.....మనసు కి ఎంతో ఊరటనిస్తుంటే, నిలువెత్తు నీ రూపాన్ని భద్రంగా నా గుండెల్లో దాచుకొని.....ఈ ప్రపంచానికంతా వినపడేలా అరిచి చెప్పాలని వుంది..... “ఇదిగో నా ప్రియ నేస్తం అని”

ఎందుకంటే...

తెలుగు భాషలో అమ్మ అనే పదం కన్నా విలువ అయినది మరొకటిలేదుకాబట్టి.

మనసు కి గాయం అయితే మనసు పలికే చిన్న మాటే "అమ్మ".
శరీరాని కి గాయం అయితే పెదవుల వెంట వచ్చే రెండు అక్షరాల పలుకే "అమ్మా".

అమ్మ గురించి ఒక కవి ఏమన్నాడో తెలుసా ?కొలిస్తే నే పలికేది ఆ దేవుడు...కాని పిలవకుండానే పలికేది "అమ్మ మనసు" మాత్రమే..

ఒక విషయం గురించి మాట్లాడమంటే 1 గంట/రోజు/నెల మట్లాడవచ్చు. కాని అమ్మ గురించి మాట్లాడమంటే జీవితాంతం మాట్లాడుతూ నే ఉండవచ్చు....అదే "అమ్మ ప్రేమ".

"ప్రాణం" అనే పదం చాలా చిన్నది "అమ్మ" అనే మాట ముందు కాదు అనగలరా ఎవరైనా?

ఈ లోకం లో నువ్వు ద్వేషించినా కూడా నిన్ను ప్రేమించే వాళ్ళు ఉన్నారు అంటే అది కేవలం అమ్మ మాత్రమే.

అమ్మ ని ప్రేమించే ప్రతి ఒక్కరి కి స్వాగతం...సుస్వాగతం...అమ్మ గురించి మట్లాడండి ఆ మాట కు ఉన్న విలువ ని మారింత పెంచండి...

ఒక్క మాట::అమ్మ గురించి మీకు తెలియదు అని కాదు..నాకు తెలిసింది మీతొ పంచుకోవడానికే ఈ "అమ్మ ప్రేమ" కమ్యూనిటీ.

***************************

నన్

ను అర్ధం చేసుకోడానికి చాలా టైమ్ పడుతుంది . మొదటిసారి చూస్తే వీడెంటి ఇలా ఉన్నాడు అనిపిస్తుంది . అలవాటయిన కొద్దీ మంచోడేమో అనిపిస్తాను. ఇంకొంచెం దగ్గరైతే చాలా స్వీట్‌గా అనిపిస్తాను. ఇవి నా మాటలు కావు నా ఫ్రెండ్స్ చెప్పిన మాటలు . పుట్టాం!! ... పెరిగాం!! ... పోయాం!!... అన్నట్టు కాకుండా చేతనైనంత సాయం చేసి ఇంకో నాలుగురికి ఆదర్శంగా నిలవాలన్నది నా ఆశ. ఎప్పుడు నవ్వుతూ హ్యాపీగా ఉంటా! గంట సీరియస్‌గా ఉంటే జీవితంలో ఒక గంట ఎందుకు పనికి రాకుండా పోయిందని అనుకుంట.ఎప్పుడూ సీరియస్‌గా కనిపించేవాళ్లను చూస్తే నాకు చిరాకు! వాళ్ళను దూరంగా ఉంచుతా.పక్కా ప్రాక్టీకల్. చుట్టూ జనం ఉండాలి నాకెప్పుడూ...ఒంటరితనం భరించలేను! ఇంకా ఏమన్నా మర్చిపోతే చెప్పండి రాసుకుంటా!!!